Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నటనకు భాష ముఖ్యం

నటనకు భాష ముఖ్యం

రాఠీ మందారం భాగ్యశ్రీబోర్సేకి సరైన విజయాలు లేకపోయినా.. సరైన అవకాశాలు మాత్రం తలుపుతడుతూనేవున్నాయి. తమిళంలో శివకార్తికేయన్‌ కథానాయకుడిగా కమల్‌హాసన్‌ నిర్మిస్తున్న 'సెయాన్‌' చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే.

తాజాగా ఈ చిత్రంలోని తన పాత్ర గురించి భాగ్యశ్రీ బోర్సే మాట్లాడింది. 'ఈ సినిమాలోని నా పాత్ర గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. అయితే.. ఈ కథలో నా పాత్ర కీలకమని మాత్రం చెప్పగలను. నన్ను ఉత్తమనటిగా ప్రేక్షకుల ముందు నిలబెట్టే పాత్ర ఇది.

అందులో సందేహం లేదు. ఏదైనా పాత్ర చేస్తున్నప్పుడు ఆ పాత్రను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే భాష చాలా ముఖ్యం. కథలోని భావోద్వేగాలను అర్థం చేసుకోకుండా నటిస్తే, అది నిరర్థకమే. అందుకే.. నిజాయితీగా ముందు భాష తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను.

తెలుగులో విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన 'కింగ్‌డమ్‌’ సినిమా నటించేటప్పుడు నా పాత్ర కోసం తెలుగు నేర్చుకొని, డబ్బింగ్‌ కూడా నేనే చెప్పుకున్నా. అదే విధంగా త్వరలో 'సెయాన్‌’ కోసం తమిళం నేర్చుకొని, నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెబుతా' అని పేర్కొన్నది భాగ్యశ్రీ బోర్సే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana