Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NBK 111 | బాలయ్య కొత్త సినిమాకు రెండక్షరాల టైటిల్ ఫిక్స్ .. సెప్టెంబర్ 6న భారీ ప్రకటన

NBK 111 | బాలయ్య కొత్త సినిమాకు రెండక్షరాల టైటిల్ ఫిక్స్ .. సెప్టెంబర్ 6న భారీ ప్రకటన

NBK 111 | నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK111పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

గతంలో 'వీరసింహారెడ్డి' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ఈ కాంబినేషన్ మరోసారి చేతులు కలపడంతో.. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో మొదటి నుంచే ఉంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లిమ్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. సినిమా అధికారిక టైటిల్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 6న ప్రకటించనున్నట్లు వెల్లడించారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.

NBK111 కోసం ఇప్పటికే రెండు పవర్‌ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. 'GOD', 'DADA' (దాదా) అనే టైటిల్స్‌లో ఒకదాన్ని సినిమాకు ఖరారు చేసే అవకాశం ఉందని టాక్ వచ్చింది.బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు, గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్‌కు ఈ రెండు టైటిల్స్ బాగా సెట్ అవుతాయని చిత్ర వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం 'దాదా' టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.అయితే దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం సెప్టెంబర్ 6న రానుంది. ఆ రోజే టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

గోపీచంద్ మలినేని ఈసారి బాలయ్యను సరికొత్త యాక్షన్ అవతార్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా కథ ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం.బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. బాలయ్య పాత్రను దర్శకుడు మరింత స్టైలిష్‌గా, మాస్ యాంగిల్‌లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన అంశం మంచు మనోజ్ విలన్‌గా నటిస్తుండటం. బాలకృష్ణకు ప్రత్యర్థిగా మనోజ్ పవర్‌ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. బాలయ్య, మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. ఇద్దరు మాస్ యాక్టర్స్ ముఖాముఖి తలపడే సన్నివేశాలు అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తాయని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరోవైపు ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సినిమాలకు తమన్ అందించే మాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండటంతో ఈ సినిమాపైనా అంచనాలు పెరిగాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana