Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెల రోజులు మానేస్తే!

నెల రోజులు మానేస్తే!

చాయ్‌.. పానీయం మాత్రమే కాదు. జీవితంలో ఒక భాగం కూడా. అయితే మన ఆరోగ్యం విషయంలో ఎదురయ్యే సమస్యలకు టీ కూడా ఒక కారణమని చాలామందికి తెలియదు. టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో ఒక 30 రోజులు చాయ్‌కు దూరంగా ఉండటం వల్ల మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయాలను పరిశీలిద్దాం…

30 రోజులు టీ మానేస్తే శరీరం అద్భుతమైన రీబూట్‌ ప్రక్రియకు లోనవుతుంది. ఈ మార్పు బాహ్య సౌందర్యానికే కాకుండా శరీరంలోని ప్రతి కణాన్నీ పునరుజ్జీవింపజేస్తుంది. ముఖంపై సహజమైన కాంతి రావడం నుంచి, మొండి మొటిమలు, మచ్చలు తగ్గడం వంటి మార్పులెన్నో చోటుచేసుకుంటాయి. కళ్ల కింద నలుపు మాయమై, ముఖం యవ్వనంగా మారుతుంది. లోలోపల అవయవాలు కూడా మరింత చురుగ్గా పనిచేస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడి, మంచి నిద్రపట్టడంతోపాటు తెలియకుండానే మనలో ఒక కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. టీలో ఉండే కెఫీన్‌ మన శరీరం నుంచి నీటిని త్వరగా బయటికి పంపించేస్తుంది. దీంతో చర్మం పొడిబారినట్లు కనిపిస్తుంది. కాబట్టి టీ మానేయడం వల్ల శరీరంలో నీటి శాతం స్థిరంగా ఉండి, చర్మకణాలకు తగిన తేమ అందుతుంది. తద్వారా ముఖం, బుగ్గలు తాజాగా మెరుస్తూ ఉంటాయి. టీ వల్ల చర్మంపై ఎర్రటి మచ్చలు, దురద, వాపు, గుల్లలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. టీ మానేస్తే ఈ సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా చకెర ఎకువగా తీసుకోవడం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచే కొలాజెన్‌, ఎలాస్టిన్‌ అనే ప్రొటీన్లు దెబ్బతింటాయి.

ఇక టీ మానేసి నీళ్లు, హెర్బల్‌ డ్రింక్స్‌ తాగడం వల్ల లివర్‌, కిడ్నీలు చురుగ్గా పనిచేసి, రక్తాన్ని సమర్థంగా శుద్ధి చేస్తాయి. టీలో మనం కలిపే పాలు, చకెర మొటిమలకు మంచి మిత్రులు. చకెర తీసుకోవడం వల్ల ఇన్సులిన్‌ ఒకసారిగా పెరుగుతుంది. ఇది చర్మంలోని నూనె గ్రంథులను ప్రేరేపించి ముఖంపై ఎకువ నూనె ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వస్తాయి. ఇక పాలలోని హార్మోన్లు మొటిమలను ప్రేరేపిస్తాయి. టీ మానేయడం వల్ల నూనె ఉత్పత్తి తగ్గి కొత్త మొటిమలు రావడం నెమ్మదిస్తుంది. కళ్ల కింద నలుపు రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి. టీలో ఉండే కెఫీన్‌ నిద్రను కలిగించే మెదడులోని అడెనోసిన్‌ను అడ్డుకుంటుంది. టీ మానేయడం వల్ల శరీరం సహజమైన నిద్ర సైకిల్‌కు చేరుకుంటుంది. గాఢ నిద్ర పట్టడం వల్ల కళ్ల చుట్టూ ఉండే రక్తనాళాలు విశ్రాంతి పొందుతాయి. ఫలితంగా కళ్ల కింద డార్క్‌నెస్‌, కళ్ల కింద వాపు కూడా తగ్గుతుంది. అయితే ఒక్కసారిగా టీ మానేస్తే మొదటి వారం రోజులు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. తేలికపాటి తలనొప్పి, నీరసం, చిరాకు ఉండొచ్చు. అలాంటప్పుడు నెల రోజుల పాటు టీకి బదులుగా గోరువెచ్చని నీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికిపోయి సత్ఫలితాలు పొందగలుగుతారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana