Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nepal Flash Floods: విదేశాల రెస్క్యూ సహాయాన్ని తిరస్కరించిన నేపాల్‌

Nepal Flash Floods: విదేశాల రెస్క్యూ సహాయాన్ని తిరస్కరించిన నేపాల్‌

కాట్మాండు: జల ప్రళయంతో అతలాకుతలమైన నేపాల్‌(Nepal Flash Floods)కు ప్రపంచ దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే తమకు ఎటువంటి సహాయం అవసరం లేదని నేపాల్ పేర్కొన్నది.

సెర్చ్, రెస్క్యూ బృందాలు సాయాన్ని నేపాల్ తిరస్కరించింది. తమ స్వంత భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే సామర్థ్యం ఉన్నట్లు నేపాల్ వెల్లడించింది. బుధవారం సంభవించిన బురద, వరద విలయం వల్ల అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అయితే బోటెకోసి, త్రిశూలీ నది పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

రెస్క్యూ ఆపరేషన్ కోసం అనేక దేశాలు, అంతర్జాతీయ సంస్థలు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయని, కానీ ఆ అభ్యర్థనలను తిరస్కరించినట్లు నేపాల్ విదేశాంగ శాఖ తెలిపింది. నేపాలీ సెక్యూర్టీ దళాలే సెర్చ్ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి వస్తున్న అభ్యర్థనలను తిరస్కరించినట్లు నేపాల్ చెప్పింది.

అయితే విదేశీ సహాయ బృందాలకు బదులుగా .. ఆర్థికసాయాన్ని నేపాల్ కోరుతోంది. పునర్నిర్మాణ దశలో అంతర్జాతీయ సహాయాన్ని కోరనున్నట్లు నేపాల్ చెప్పింది. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 469కి చేరుకున్నది. టిబెట్‌లో మళ్లీ వరదలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌ను చైనా నిలిపివేసింది. 10 లక్షల డాలర్ల ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్లు శ్రీలంక ప్రకటించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana