న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్(New York) సిటీలో ఉన్న టైమ్స్ స్క్వేర్ వద్ద ఓ మహిళ కత్తులతో దాడి చేసింది. ఆ దాడిలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు.
వెస్ట్ 42వ స్ట్రీట్ , సెవన్త్ అవెన్యూలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మన్‌హట్టన్‌లో టూరిస్టులతో రద్దీగా ఉండే ప్రదేశంలో ఈ అటాక్ జరిగింది. అయితే ఆ మహిళ మానసికంగా డిస్టర్బ్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. షాపింగ్ బ్యాగ్ నుంచి రెండు పొడుగైన కిచెన్ కత్తులను తీసి ఇద్దరిపై అటాక్ చేసింది.
ఓ 68 ఏళ్ల వ్యక్తితో పాటు మరో 32 ఏళ్ల అమ్మాయిని కత్తితో కడుపులో పొడిచింది. ఆ ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించారు. అయితే గాయాల వల్ల మహిళ మృతిచెందినట్లు గుర్తించారు. టైమ్స్ స్క్వేర్‌లోని న్యూయార్క్ సబ్‌స్టేషన్ వద్ద పోలీసులు ఆమెను చుట్టుముట్టి షూట్ చేశారు.

