Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్‌ రీ-ఎగ్జామ్‌ పెన్‌-పేపర్‌ విధానంలోనే!

నీట్‌ రీ-ఎగ్జామ్‌ పెన్‌-పేపర్‌ విధానంలోనే!

  • సుప్రీంకోర్ట్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్‌ రీ-ఎగ్జామ్‌ను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)గా నిర్వహించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్ట్‌ సోమవారం తిరస్కరించింది.

పరీక్ష రద్దయిన తర్వాత మళ్లీ నిర్వహిస్తున్నారని.. ఈ తరుణంలో ఏజెన్సీలు సవాళ్లతో, ఒత్తిడితో పని చేస్తున్నాయని జస్టిస్‌ నరసింహ పిటిషనర్‌కు తెలిపారు. ఈ సమయంలో పరీక్ష విధానాన్ని మార్చ డం సాధ్యం కాదన్నారు. తదుపరి విచారణను జూలైకి వాయి దా వేశారు. దీంతో రీ-ఎగ్జామ్‌ పెన్‌-పేపర్‌ విధానంలో జరుగనుంది. నీట్‌, ఎన్టీఏ, సంప్రదాయ పరీక్ష విధానం-సీబీటీలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సోమవారం చర్చించింది. ఎన్టీఏను రద్దు చేసి కొత్త జాతీయ పరీక్షల సంస్థను పార్లమెంట్‌ చట్టం ద్వారా ఏర్పాటు చేయాలని ది యునైటెడ్‌ డాక్టర్స్‌ ఫ్రంట్‌ స్థాయీ సంఘాన్ని కోరింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana