తాజావార్తలు
నో బ్యాక్‌డోర్ ఎంట్రీ: సివిల్స్‌కు ఎంపికపై ఓంబిర్లా తనయ

న్యూఢిల్లీ: తాను తన తండ్రి హోదాను అడ్డం పెట్టుకుని ఐఏఎస్‌కు ఎంపికైనట్లు వచ్చిన ఆరోపణలు, వదంతులు, సోషల్ మీడియా పోస్టులపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కూతురు అంజలీ బిర్లా గురువారం స్పందించారు. ఇటువంటి వదంతులు వ్యాపింపజేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు చట్టం తేవాలన్నారు. వదంతులు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, జవాబుదారీ చేయాలన్నారు. ఈ రోజు తాను బాధితురాలిని అయినట్లే, భవిష్యత్‌లో మరొకరు బాధితులు కావచ్చునన్నారు. ఐఏఎస్‌కు జరిగిన పరీక్షల్లో తొలిదశలోనే మూడు పరీక్షల్లోనూ పాస్ అయ్యారు అంజలీ బిర్లా.
అంతే కాదు సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షలు-2019లో మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. కానీ అంజలీ బిర్లా..
లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా కూతురిగా... ఆయన హోదా సాయంతో సివిల్స్‌కు ఎంపికయ్యారని సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. తాను, తన జీవితం అంతా నిజాయితీగానే ఉంటుందని, తానెలా శ్రమించానో తన బంధు,మిత్రులకు తెలుసునన్నారు. యూపీఎస్సీ పరీక్షలు మూడు దశల్లో జరుగుతాయని, మూడింటిలో పాస్ అయితేనే సివిల్స్‌కు ఎంపికవుతారని అంజలీ బిర్లా తెలిపారు. యూపీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా ఉంటాయని, వ్యవస్థ సమగ్రతను గౌరవించడం నేర్చుకోవాలన్నారు.
related stories
-
తాజావార్తలు రాహుల్.. మీకు మత్స్యశాఖ ఉన్న విషయం కూడా తెలియదా?
-
ముఖ్యాంశాలు ఛానల్‌ను, పేపర్‌ను బహిష్కరించిన ఏపీ బీజేపీ
-
తాజావార్తలు మహిళా ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు