Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NTR | ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్‌పై కీలక అప్‌డేట్.. మరో రెండు వారాల్లో రీ స్టార్ట్, రిలీజ్ విషయంలోనూ క్లారిటీ

NTR | ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్‌పై కీలక అప్‌డేట్.. మరో రెండు వారాల్లో రీ స్టార్ట్, రిలీజ్ విషయంలోనూ క్లారిటీ

NTR | టాలీవుడ్‌లో ప్రస్తుతం భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'డ్రాగన్' సినిమా ఒకటి.

ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రశాంత్ నీల్ తనదైన మాస్ టేకింగ్‌కు ఎన్టీఆర్ ఇమేజ్ తోడవడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 'డ్రాగన్' షూటింగ్‌కు చిన్న బ్రేక్ పడిన విషయం తెలిసిందే. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం కావడంతో ఆయనకు విశ్రాంతి అవసరం కావడంతో చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు.

ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ 'డ్రాగన్' షూటింగ్‌ను మరో రెండు వారాల్లో తిరిగి ప్రారంభించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా కోలుకునే ప్రక్రియలో ఉన్నారని, ఆయన షూటింగ్‌కు సిద్ధమైన వెంటనే చిత్రీకరణను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన మేకర్స్.. మిగిలిన షూటింగ్‌ను కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'డ్రాగన్' షూటింగ్ విషయంలో మేకర్స్ మరో కీలక విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సినిమా మొత్తం చిత్రీకరణను ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంటే షూటింగ్ రీస్టార్ట్ అయిన తర్వాత వరుస షెడ్యూల్స్‌తో చిత్రీకరణను వేగంగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లోనూ సినిమా రిలీజ్‌పై నెలకొన్న సందేహాలకు కొంతమేర క్లారిటీ వచ్చినట్లయింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు. 'డ్రాగన్' విడుదల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ స్పష్టం చేసినట్లు సమాచారం. షూటింగ్‌లో తాత్కాలిక విరామం వచ్చినప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను సమాంతరంగా కొనసాగిస్తూ అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ నెలకొంది. ఎన్టీఆర్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్‌కు ప్రశాంత్ నీల్ యాక్షన్ ట్రీట్‌మెంట్ కలిస్తే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana