Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NZW vs SCOW | షార్ప్, హల్లిడే మెరుపులు.. న్యూజిలాండ్ సెమీస్ ఆశలు సజీవం..!

NZW vs SCOW | షార్ప్, హల్లిడే మెరుపులు.. న్యూజిలాండ్ సెమీస్ ఆశలు సజీవం..!

NZW vs SCOW : మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ బీలోని న్యూజిలాండ్ సెమీస్ ఆశలు నిలబెట్టుకుంది. కౌంటీ గ్రౌండ్‌లో మంగళవారం స్కాట్లాండ్‌పై మేలియా కేర్(3-17) బంతితో రాణించగా..

మిడాలార్డర్ బ్యాటర్లు ఓపికగా ఆడి 6 వికెట్ల విజయాన్ని కట్టబెట్టారు. 132 పరుగుల ఛేదనలో 26/3తో కష్టాల్లో పడిన కివీస్‌ను ఇజా షార్ప్(62), బ్రూక్ హల్లిడే(41 నాటౌట్)లు ఆదుకున్నారు. గెలుపు బాధ్యత తీసుకున్న ఈ ద్వయం శతక భాగస్వామ్యంతో మ్యాచ్‌ను లాగేసుకుంది. వరసగా రెండో విజయంతో వైట్ ఫెర్న్ నాలుగు పాయింట్లు సాధించింది.

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ వరసగా రెండో విజయంతో మురిసింది. సెమీస్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో వైట్ ఫెర్న్ ధాటికి స్కాట్లాండ్ చిత్తైంది. 132 రన్స్ ఛేదనలో ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు పడినా బ్యాటర్లు ఒత్తిడికి లోనవ్వలేదు. స్కాట్లాండ్ పేసర్ క్యాథరిన్ బ్రైసీ ఓపెనర్లు మేలియా కేర్(2), ఇసబెల్లా గేజ్ (16)ను పెవిలియన్ చేర్చగా.. సోఫీ డెవినె(1)ను రాచెల్ స్లేటర్ ఔట్ చేసింది.

స్కాట్లాండ్ పేసర్ల విజృంభణకు 26 పరుగులకే ముగ్గురు ఔటైన వేళ.. ఇజా షార్ప్(62), బ్రూక్ హల్లిడే(41 నాటౌట్)లు క్రీజునంటుకుపోయారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూనే.. రన్‌రేటు తగ్గకుండా చూసుకున్న ఈ జంట మ్యాచ్‌ను కివీస్‌ వైపు తిప్పింది. నాలుగో వికెట్‌కు శతక భాగస్వామ్యంతో స్కాట్లాండ్‌ను ఓడించారు. ఆరు వికెట్ల తేడాతో నెగ్గిన కివీస్ నాలుగు పాయింట్లో గ్రూప్ బీల్ మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది.

కార్టర్ హాఫ్ సెంచరీ..

టాస్ ఓడి తొలుత ఆడిన స్కాంట్లాడ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్ డార్సే కార్టర్‌(72 నాటౌట్) ధాటిగా ఆడినా ఆమెకు సహకరించేవాళ్లు కరువయ్యారు. మరో ఓపెనర్ క్యాథరీన్ ఫ్రేజర్‌(7) విఫలమవ్వగా.. మిడిలార్డర్‌ను సోఫీ డెవినె(2-19), మేలియా కేర్(3-17) కూల్చారు.

ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా ఆడిన కార్టర్ ఈ సీజన్‌లో వరసగార ఎండో అర్ధ శతకం బాదేసింది. ఆమె పోరాటం ఫలితంగా స్కోర్ 130 దాటింది. కానీ, 19వ ఓవర్లో రెండు వికెట్లు తీసిన మేలియా కేర్ ఒక్క పరుగు ఇవ్వలేదు. దాంతో, స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగలిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana