Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓలా ఎస్‌1కు తొలిరోజు విశేష స్పందన

ఓలా ఎస్‌1కు తొలిరోజు విశేష స్పందన

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15: ఓలా ఎలక్ట్రిక్‌.. తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఎస్‌1 అమ్మకాలను బుధవారం ప్రారంభించింది. తొలిరోజు సెకనుకు 4 స్కూటర్ల చొప్పున అమ్మకాలను చూశామని ఓలా సహవ్యవస్థాపకుడు భవిష్‌ అగర్వాల్‌ తెలిపారు.

భారత్‌ పెట్రో వాహనాలను వద్దనుకుంటున్నదని, విద్యుత్తు ఆధారిత వాహనాలను కోరుకుంటున్నదంటూ ట్వీట్‌ చేశారు. కాగా, ఎస్‌1, ఎస్‌1 ప్రో మోడల్స్‌ ఇప్పటికైతే ఓలా యాప్‌పై మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంటాయని, వెబ్‌సైట్‌పై ఉండబోవని సంస్థ తెలిపింది. నిజానికి ఈ నెల 8 నుంచే సేల్స్‌ మొదలు కావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యలతో వారంపాటు వాయిదా పడింది. కాగా, ఎస్‌1 ధర రూ.99,999, ఎస్‌1 ప్రో ధర రూ.1,29,999గా ఉన్నది. స్కూటర్‌ కొనుగోలుదారులు రూ.20వేల అడ్వాన్స్‌తో బుక్‌ చేసుకోవచ్చని, డెలివరీ సమయంలో మిగతా మొత్తం ఇవ్వచ్చని సంస్థ తెలియజేసింది. వచ్చే నెల నుంచి డెలివరీలు మొదులుకానున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana