Onions distribution | ఉచిత ఉల్లిగడ్డల పంపిణీలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తవడంతో వరంగల్‌లో కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి ఉచిత ఉల్లిగడ్డ పంపిణీ చేశారు.
దీంతో ఒక్కసారిగా జనం ఉల్లిగడ్డల కోసం ఎగబడ్డారు. ఉల్లిగడ్డలు తీసుకునేందుకు ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళల పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో సదరు కాంగ్రెస్ నేత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

