తాజావార్తలు
ఒంటరిగా డాక్టర్ వ్యాక్సినేషన్.. భార్య నిలదీసిన వీడియో వైరల్

న్యూఢిల్లీ: భార్యను వదిలేసి ఒంటరిగా వ్యాక్సినేషన్ చేయించుకున్న ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న కార్డియాలజిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కేకే అగర్వాల్.. తన సతీమణితో జరిపిన ఫోన్ సంభాషణ.. ట్విట్టర్‌లో వైరలైంది. 1.6 లక్షలకు పై చిలుకు నెటిజన్లు దాన్ని వీక్షించారు.
వ్యాక్సినేషన్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించిన వెంటనే భార్య నుంచి డాక్టర్ అగర్వాల్‌కు ఫోన్ వచ్చింది. వీడియో కాల్ చేసిన ఆమె.. తనను వెంట తీసుకెళ్లకుండా ఒంటరిగా ఎందుకు వెళ్లావు? అని పదేపదే భర్తను నిలదీశారు. సోమవారం తనకు వ్యాక్సినేషన్ చేయిస్తానని ఎంత చెబుతున్నా.. అగర్వాల్‌ను నాకెందుకు అబద్దాలు చెబుతావని కడిగి పారేశారు. కారులో కూర్చునేందుకు ప్రయత్నిస్తూనే ఫోన్ కాల్ కట్ చేయడానికి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. తాను లైవ్‌లోకి వెళతానని, మీరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు.
ట్విట్టర్ యూజర్ తరుణ్ శుక్లా.. తన బ్లాగ్‌లో.. డాక్టర్ కేకే అగర్వాల్ భార్య లేకుండానే వ్యాక్సినేషన్ చేయించుకున్నాడు.. అని రాశారు. ఈ నెల 23వ తేదీన డాక్టర్ అగర్వాల్ తన వ్యాక్సినేషన్ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు. భార్యతో సంభాషణపై నేరుగా స్పందించలేదు. కానీ తర్వాత ట్విట్టర్ వేదికగా అగర్వాల్ ప్రతిస్పందించారు. సదరు వీడియో గురించి తెలుసునని, తన భార్యకు తన ఆరోగ్యం, భద్రత గురించేనని ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ప్రకటన చేశారు.
Doctor KK Agarwal got himself vaccinated without his wife.
- Tarun Shukla (@shukla_tarun) January 27, 2021
Note to self : don't ever pick-up phone while you are live on tv :)
#forwarded. pic.twitter.com/uhIQYvZ4IO
#GetVaccinated #COVID19 pic.twitter.com/M5KQNyUNJh
- Dr K K Aggarwal (@DrKKAggarwal) January 27, 2021
related stories
-
ఖమ్మం కోవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి : డీఎంఅండ్‌హెచ్‌ఓ
-
నిజామాబాద్ పది కేంద్రాల్లో కొవిడ్ టీకా
-
నిజామాబాద్ ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలకు నిధులు