హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు చుట్టూ నిరంతరం పచ్చదనం ఉండేలా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. 158 కి.మీ మేర ఉన్న ఓఆర్‌ఆర్ చుట్టూ పెంచుతున్న చెట్లు, మొక్కలు, పూల మొక్కల కోసం డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫిబ్రవరి-మార్చి నెలల్లో టెండర్లు పిలువగా, కంపెనీల సామర్థ్యం సరిగా లేకపోవడంతో మరోసారి టెండర్లను పిలిచారు. ఓఆర్‌ఆర్‌లో ఎంతో విశాలమైన స్థలం అందుబాటులో ఉండటంతో ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటి పెంచుతున్నారు.
వాటిని సంరక్షించేందుకు అపార అనుభవం ఉన్న కంపెనీలను ఎంపిక చేసేందుకు రెండోసారి టెండర్లను పిలిచినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

