Dailyhunt
పాక్‌లో వాహనాన్ని ఢీకొట్టిన రైలు.. సిక్కు యాత్రికులు మృతి

పాక్‌లో వాహనాన్ని ఢీకొట్టిన రైలు.. సిక్కు యాత్రికులు మృతి

హైదరాబాద్‌: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని రైలు ఢీకొట్టిన ఘటనలో 15 మంది మృతిచెందారు. దాంట్లో పది మంది సిక్కు యాత్రికులు ఉన్నట్లు గుర్తించారు. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. షేక్‌పురా రైల్వే స్టేషన్ వద్ద షా హుస్సేన్ ఎక్స్‌ప్రెస్‌ను.. సిక్కు యాత్రికులు వెళ్తున్న వాహనం ఢీకొట్టింది. నాన్‌కానా సాహిబ్ నుంచి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.

షేక్‌పురాలో మానవరహిత లెవల్ క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత డివిజినల్ ఇంజినీర్‌ను సస్పెండ్ చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రి షేక్ రషీద్ ఆదేశించారు.

నాలుగు నెలల క్రితం సింధు ప్రావిన్సులో కూడా రైల్వే క్రాసింగ్ వద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 19 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana