Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంట ఎండిందని పానం తీసుకున్నడు.. మధ్యలోనే ఆగిపోయిన 'ఇందిరమ్మ ఇల్లు'

పంట ఎండిందని పానం తీసుకున్నడు.. మధ్యలోనే ఆగిపోయిన 'ఇందిరమ్మ ఇల్లు'

  • అప్పు కూడా దొరుకక రైతన్న ఆందోళన
  • పురుగుల మందు తాగి బలవన్మరణం

గంభీరావుపేట, మే 29 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌ పాలనలో రైతుల బతుకులు ఆగమవుతున్న యి.

ఆదుకొనేవారు కానరాక ఓ రైతన్న నిండు ప్రాణాన్ని బలి తీసుకొన్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన పాల్వంచ అశోక్‌ (39) రెండెకరాల వ్యవసాయ భూమినే నమ్ముకొని బతుకుతున్నాడు. కూలీ పనులు కూడా చేస్తుంటాడు. మొదటివిడత కింద ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో సంబురపడ్డా డు. తన చేతిలో ఉన్న పైసలతో ఇంటి నిర్మాణం మొదలు పెట్టాడు.

బిల్లులు రావడంతో గోడల వరకు పూర్తిచేశాడు. స్లాబుకు చెక్క కొట్టాడు. ఆ తర్వాత పైస లు లేకపోవడంతో పని ఆగింది. మరోవైపు యాసంగిలో సాగు చేసిన వరి పంట నీరందక ఎండిపోయింది. పంట ఎండిపోవడం, ఇల్లు ఆగిపోవడంతో ఆందోళన చెందాడు. 20న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం అశోక్‌ చనిపోయాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana