Wednesday, 05 Aug, 5.07 am నమస్తే తెలంగాణ

తెలంగాణ
పంట వివరాలు చెప్పండి

  • పథకాలను సులభంగా అందుకోండి
  • రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా సూచన
  • వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అన్నదాతలు తాము వేసిన పంటల వివరాలను వ్యవసాయశాఖకు తప్పకుండా చెప్పాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. తద్వారా పంటలను అమ్ముకోవడంలో ఇబ్బందులు తొలగిపోవడంతోపాటు రైతుబంధు, ఇతరత్రా పథకాలు సులభంగా అందుతాయని చెప్పారు. వానకాలం సీజన్‌లో రైతుల పంటల వివరాల నమోదు కార్యక్రమాన్ని ఆయన మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏఈవోలు నమోదు చేస్తున్న పంటల వివరాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో మంగళవారం ఆయన వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించారు. పలువురు రైతుల పొలాలను స్వయంగా సందర్శించిన పల్లా.. పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డితో కలిసి వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం గడిసింగపూర్‌లోని రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపనచేశారు. కార్యక్రమాల్లో ఆయా జిల్లాల స్థానిక నేతలు, వ్యవసాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top