Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పర్యావరణ నేపథ్యంలో సమవర్తి

పర్యావరణ నేపథ్యంలో సమవర్తి

విభిన్న కథా చిత్రాల్ని ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు హీరో సత్యదేవ్‌. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి 'సమవర్తి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

అజయ్‌ నాగ్‌ వి దర్శకుడు. త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇందులో సత్యదేవ్‌ కత్తులు, గొడ్డళ్ల బంధనం నడుమ భయం లేకుండా కనిపిస్తున్నారు. ఎకోలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిదని, ఇప్పటిదాకా తెలుగులో రానటువంటి జోనర్‌ ఇదని, సత్యదేవ్‌ పాత్ర ఇంటెన్స్‌గా సాగుతుందని మేకర్స్‌ తెలిపారు. దిలీప్‌ పోతన్‌, రాజీవ్‌ కనకాల, గనవి లక్ష్మణ్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హర్ష మల్లికార్జున, దేవ్‌దీప్‌ గండికుండు, సంగీతం: సింజిత్‌ యెర్రమల్లి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఉల్లాస్‌ హైదుర్‌, దర్శకత్వం: అజయ్‌ నాగ్‌ వి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana