- భారత నావికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి
- భారత్‌పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా రక్షిస్తుంది : ట్రంప్
ఎవియన్-లెస్-బెయిన్స్(ఫ్రాన్స్), జూన్ 17 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ బుధవారం భేటీ అయ్యారు.
ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని అమలు చేసే క్రమంలో నావికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని ట్రంప్‌ను కోరారు. హొర్ముజ్ జలసంధి వద్ద అమెరికా సైనిక దాడుల్లో ఒక వాణిజ్య నౌకకు చెందిన ముగ్గురు భారతీయ సిబ్బంది మరణంపై భారత్‌లో ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఇక్కడ జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆ ఇద్దరు నాయకుల మధ్య భేటీ జరిగింది. భారత్‌ను విశ్వసనీయ భాగస్వామిగా అభివర్ణించిన ట్రంప్ భారత్‌పై ఎవరైనా దాడి చేస్తే అమెరికా దాన్ని రక్షిస్తుందని అన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణలకు ముగింపు పలికేందుకు ట్రంప్ చేసిన కృషిని ప్రధాని మోదీ అభినందించారు.
మోదీపై ప్రశంసలు
తమ మధ్య సమావేశాన్ని గొప్పదిగా అభివర్ణించిన ట్రంప్ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎటువంటి కాలపరిమితిని చెప్పకుండా తాను భారతదేశాన్ని పర్యటిస్తానని ట్రంప్ తెలిపారు. ఆయన(మోదీ) చాలా మంచి మనిషని ప్రజలు అంటుంటారు. కానీ ఆయన చాలా కఠినమైన వ్యక్తని నేను చెప్పాను. చర్చల్లో ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తారు. అని ట్రంప్ అన్నారు. ప్రధాని మోదీ అందంగా ఉన్నారని, ఏంజెల్‌లా ఉన్నారని పొగిడారు.

