Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pawan kalyan | పవన్‌ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన హైకోర్టు

Pawan kalyan | పవన్‌ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన హైకోర్టు

Pawan kalyan | జనసేన చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సభ నిర్వహించతలపెట్టగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.

తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే పవన్‌ కల్యాణ్‌ సభకు హైకోర్టు అనుమతి నిరాకరించింది.

జనసేన దాఖలు చేసిన హౌస్‌ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో ఇవాళ సాయంత్రం పవన్‌ కల్యాణ్ సభ లేనట్టేనని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచే పవన్‌ కల్యాణ్ ప్రెస్‌ మీట్‌ పెట్టి మాట్లాడనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana