Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పేదల చదువును ఓర్వలేని సీఎం

పేదల చదువును ఓర్వలేని సీఎం

  • అందుకే ఫీజు బకాయిలకు అడ్డుకట్ట: ఆర్‌ కృష్ణయ్య

రవీంద్రభారతి, ఆగస్టు 27: ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లోని పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంటే ఓర్వలేని సీఎం రేవంత్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర పన్నుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య ధ్వజమెత్తారు.

ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డి మాండ్‌ చేశారు. గురువారం బషీర్‌బాగ్‌ చౌరస్తాలో వందలాది మంది విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలకులు స్కాలర్‌షిప్‌లకు, ఫీజురీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్‌ లేదని, అందుకే చెల్లించడంలేదని అనడం చే తకానితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశా రు. అన్నింటికీ ఉన్న బడ్జెట్‌ ఫీజు బకాయిలకు ఉండదా? అని కృష్ణయ్య ప్రశ్నించారు. ఇ ప్పటివరకు రూ.4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ర్టాన్ని ఏం అభివృద్ధి చేశావో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బకాయిలు చెల్లించే వరకూ కాంగ్రెస్‌ ప్ర భుత్వాన్ని వదలిపెట్టమని ఆయన హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana