Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi | 'పెద్ది' ప్రమోషన్స్‌కు నెక్ట్స్ లెవెల్ హైప్.. 'మస్సా మస్సా' సాంగ్ అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్!

Peddi | 'పెద్ది' ప్రమోషన్స్‌కు నెక్ట్స్ లెవెల్ హైప్.. 'మస్సా మస్సా' సాంగ్ అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్!

Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది' విడుదలకు సిద్ధమవుతోంది.

భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తగా.. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా.. జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో మూవీపై మ్యూజిక్ పరంగా కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'పెద్ది' ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, ప్రెస్ మీట్స్‌తో చిత్ర బృందం ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే మూవీ నుంచి మోస్ట్ అవేటెడ్ ట్రాక్ 'మస్సా మస్సా' సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎనర్జిటిక్ బీట్‌లు, ఇన్‌స్పిరేషనల్ లిరిక్స్, రామ్ చరణ్ స్టైలిష్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ కంపోజిషన్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. చాలా మంది ఈ పాటను ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అయితే ఈ సాంగ్‌పై అభిమానుల మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్‌లో 'మస్సా మస్సా' పాట మరింత పవర్‌ఫుల్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హిందీ లిరిక్స్, వోకల్స్, బీట్ మిక్సింగ్ ఆడియన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో తెలుగు వర్సెస్ హిందీ వెర్షన్‌పై డిబేట్ కూడా మొదలైంది. ఇప్పటికే ట్రైలర్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన 'పెద్ది' టీమ్.. ఇప్పుడు 'మస్సా మస్సా' పాటతో ప్రమోషన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందని అభిమానులు చెబుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్, యాక్షన్, ఎమోషన్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందనే నమ్మకంతో మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana