Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi Sudarshan Reddy | సెప్టెంబర్‌ 2న కాళోజీ కళాక్షేత్రంలో పెద్ది సుదర్శన్‌ రెడ్డి యాది సభ

Peddi Sudarshan Reddy | సెప్టెంబర్‌ 2న కాళోజీ కళాక్షేత్రంలో పెద్ది సుదర్శన్‌ రెడ్డి యాది సభ

నుమకొండ చౌరస్తా, ఆగస్టు 31: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే అమరుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి యాదిసభ సెప్టెంబర్‌ 2వ తేదీ బుధవారం కాళోజీ కళాక్షేత్రంలో సాయంత్రం 3 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పూర్వ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో యాది సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మర్రి యాదవరెడ్డి, తెలంగాణ ఆకాంక్ష వేదిక జేఏసీ నేత రేపల్లె నరోత్తమసూరి, కేయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ సీఎస్ దినేష్‌కుమార్‌, బీఆర్‌ఎస్ రాష్ర్ట నాయకులు యాదగిరిరెడ్డి, సిపిఐ రాష్ర్ట నాయకులు పాముల వెంకటరాములు, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నున్న అప్పారావు, కేయూ ఉద్యమకారుడు సాదు రాజేష్‌ మాట్లాడారు.

పత్యేక రాష్ర్టం కావాలనే ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తి పెద్ది సుదర్శన్‌ రెడ్డి, మలిదశ ఉద్యమంలో క్రియా శీలకు పాత్ర పోషించారని వారు గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ వస్తే తప్ప పెళ్లి చేసుకోనని తెలంగాణ వస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి తెలంగాణ వచ్చాక పెళ్లి చేసుకున్నారని, ఉద్యమకారుడు అమరుడు పెద్ద సుదర్శన్‌రెడ్డి మరణం బాధాకరమన్నారు. గతంలో బియ్యాల జనార్ధన్‌రావు, జయశంకర్‌ కాళోజి లాంటివారు మరణిస్తే ఎలా చేశామో ఇప్పుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి యాది సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీ నేతలు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అడ్వకేట్‌ అబ్దుల్‌ నబీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు జైసింగ్‌ రాథోడ్‌, మాజీ కార్పొరేటర్‌ జోరిక రమేష్‌, కేయూ లెక్చరర్‌ మంద వీరస్వామి, సూత్రపు అనిల్‌, బిక్షపతినాయక్‌, ఫిరోజ్‌, వల్లివుల్లా ఖాద్రి, నీలం రాజకిషోర్‌, సురాసి కృష్ణ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana