జాతీయం
పెండ్లి చేసుకొమ్మని ఆదేశించలేదు!

న్యూఢిల్లీ: మహిళల పట్ల తమకు అపార గౌరవం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటీవల ఓ అత్యాచారం కేసు విచారణలో తాము చేసిన వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకొన్నారన్నది. పెండ్లి చేసుకొంటానని ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారం జరిపిన కేసు గతవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా నిందితుడిని కోర్టు 'ఆ అమ్మాయిని పెండ్లి చేసుకొంటావా?' అని ప్రశ్నించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కోర్టు స్పష్టతనిస్తూ..బాధితురాలిని 'పెండ్లి చేసుకొంటున్నారా?' అని నిందితుడిని అడిగామని పేర్కొంది.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
related stories
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు నీ పాపం పండెను నేడు... నీ భరతం పడతా చూడు.. రఘురామ సెటైర్లు
-
తెలంగాణ వార్తలు రోడ్డుపై గుంత: చందానగర్ ఇన్స్పెక్టర్కు నోటీసులు
-
జాతీయం భూమి స్వాధీనం కేసులో రూ.2 కోట్ల పరిహారం