Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పేయింటర్‌ దారుణ హత్య

పేయింటర్‌ దారుణ హత్య

వహర్‌నగర్‌, మే 22: పేయింటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో సైదులు తెలిపిన కథనం ప్రకారం గోరఖ్‌పూర్‌ నుంచి నగరానికి వలస వచ్చి జవహర్‌నగర్‌లో అనిల్‌ కుమార్‌ (43) నివాసముంటున్నాడు.

పేయింటింగ్‌ కాంట్రాక్టర్‌గా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అనిల్‌ కుమార్‌ నివసించే గదిలో నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించా రు.

వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… పరిశీలించగా కుళ్ళిన స్థితిలో మృతదేహం కనిపించింది. అనిల్‌కుమార్‌ స్నేహితులతో కలిసి మద్యం తాగిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయని… ఆర్ధిక తగాదాలా లేక ఇతరత్రా కారణాలతో హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. ఇంటి యజమాని అశోక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana