హైదరాబాద్, అక్టోబర్ 31: దేశంలోనే తొలిసారిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన పురుగుమందు అణువుతో రూపొందించిన పియోక్సాజోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది పీఐ.
దశాబ్దకాలంగా సాగుతున్న స్వదేశీ శాస్త్ర సాంకేతిక ఆవిస్కరణలు దేశీయ రైతుల కోసం కొత్త పంట సంరక్షణ పరిష్కారంగా రూపుదిద్దుకున్నాయి.
వరి పంటలో పసుపు కాండంలో తొలిచే పురుగు, మొక్కజొన్నలో లద్దె పురుగు, శనగ పంటలో కాయ తొలిచే పురుగుపై సమర్థవంతంగా పనిచేస్తున్నదని కంపెనీ వైస్ చైర్పర్సన్, ఎండీ మయాంక్ సింఘాల్ తెలిపారు.

