Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పిల్లల లైంగిక వేధింపుల ప్రకటనలు తొలగించండి

పిల్లల లైంగిక వేధింపుల ప్రకటనలు తొలగించండి

  • మెటాకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ : ఇన్‌స్టాగ్రామ్‌లోని చెల్లింపు ప్రకటనల్లో పిల్లల లైంగిక దోపిడీ, దుర్వినియోగ కంటెంట్‌ ఉండటంపై కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసిందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఆదివారం పేర్కొంది.

వెంటనే ఆ తరహా ప్రకటనలను, సమాచారాన్ని తొలగించాలని ఆదేశించింది. ఈ విషయమై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మెటాను కోరింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌ ఉందని బీబీసీ పరిశోధనాత్మక కథనం తెలపడంతో కేంద్రం ఈ చర్యలు తీసుకొంది. బీబీసీ కథనం ప్రకారం మోడరేషన్‌ ప్రక్రియ దాటిన తర్వాతే ఆ తరహా ప్రకటనలు ప్లాట్‌ఫాం మీద కనిపించాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana