Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Police Firing | పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు

Police Firing | పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు

మరావతి : నిందితుడిని పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై కత్తితో దాడి చేయడంతో కానిస్టేబుల్‌కు, పోలీసులు రక్షణగా కాల్పులు ( Police Firing ) జరపడంతో నిందితుడికి గాయాలయిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది.

రాత్రి తూర్పుగోదావరి ( East Godavari ) జిల్లా నల్లజర్ల సమీపంలోని దేవరపల్లిలో పెట్రోలింగ్ విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ గమనించాడు. వారి వద్ద ఉన్న బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తుండగా.. ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్‌పై దాడి చేశారు.. ఆపై నిందితులు ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలించగా కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద ఉన్నట్లు తెలుసుకున్న సీఐ, కానిస్టేబుల్ శ్రీనివాస్ , రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వెళ్లారు. నిందితుడు అవినాద్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. సీఐ, కానిస్టేబుల్‌పై రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో కత్తితో పొడవంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సీఐ అప్రమత్తమైన అవినాద్ కాళ్లపై కాల్పులు జరపడంతో గాయపడ్డ నిందితుడిని అవినాద్‌ను , కానిస్టేబుల్‌ను ఆస్పత్రిలో చేర్పించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana