సుమన్, భానుచందర్, జె.బాబు హీరోలుగా నటిస్తున్న చిత్రం 'నక్షత్ర పోరాటం-2'. సీనియర్ దర్శకుడు సాగర్ స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ 'సమాజంలోని అవినీతి, అక్రమాలపై పోరాడే నిజాయితీపరుడైన ఓ పోలీస్ అధికారి కథ ఇది. సుమన్, భానుచందర్, బాబు పాత్రలు శక్తివంతంగా ఉంటాయి. కోటి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఆంధ్రప్రదేశ్, కేరళలలో షూటింగ్ జరుపుతాం. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం' అని తెలిపారు. ఆమని, కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటించనున్నారు.

