ప్రపంచం
పోలీస్ స్టేషన్‌లో జుట్టు కత్తిరింపు : 31 మందికి భారీ జరిమానా

లండన్ : పోలీస్ స్టేషన్ లోపల జుట్టు కత్తిరించికున్న పోలీసు అధికారులకు ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. మరోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉండేందుకు వారికి ఒక్కొక్కరికి రూ.2000 జరమానా విధించారు. రూ.200 కటింగ్‌కు రూ.2000 జరిమానా కట్టాల్సి రావడంతో పోలీసులంతా విస్తుపోయారట.
తూర్పు లండన్‌లోని బేత్నాల్ గ్రీన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయటకు వెళ్లేందుకు బయపడిపోయారు. దాంతో జట్టు కత్తిరించుకునేందుకు ఒక ప్రొఫెషనల్ మంగలిని ఏకంగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకుని వెంట్రుకలు కత్తిరించుకునే పని చేపట్టారు. ఈ విషయం ఆనోటా ఈనోటా ఉన్నతాధికారులకు చేరడంతో పోలీస్ స్టేషన్‌లోనే జట్టు కత్తిరించుకోవడమా?
ఎంత బాధ్యతారాహిత్యం అంటూ ఉన్నతాధికారులు అగ్గిమీద గుగ్గిలమయ్యారంట. కరోనా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో వారికందరికీ తలా 200 పౌండ్లు జరిమానా విధించారు. అంటే దాదాపు రూ.2000 అన్నమాట. ఇలా పీఎస్‌లో వెంట్రుకలు కత్తిరింపు కార్యక్రమానికి దిగిన 31 మందికి జరిమానా వేశారు.
టర్కిష్ మూలానికి చెందిన మంగలి.. పోలీసు కట్టింగ్ చేయడంలో చేయి తిరిగిన వ్యక్తి. ఒక్కొక్కరికి జట్టు కత్తిరించడానికి 10 పౌండ్ల చొప్పున తీసుకుంటాడు. తన కింది ఉద్యోగుల బాధ్యతారాహిత్య చర్యకు తీవ్ర నిరాశకు లోనయ్యానని డిటెక్టివ్ చీఫ్ సూపరింటెండెంట్ మార్కస్ బార్నెట్ విచారం వ్యక్తం చేశారు. మెట్రోపాలిటన్ పోలీసు అధికారులందరికీ పెనాల్టీ నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. లాక్‌డౌన్ సమయంలో ఒక కేఫ్ లోపల అల్పాహారం తిన్నందుకు అధికారులకు ఒక్కొక్కరికి 200 పౌండ్ల జరిమానా విధించిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరుగడం కాకతాళీయమే.