Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పొలిటికల్‌ లెగసీ

పొలిటికల్‌ లెగసీ

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా 'లెగసీ'. సాయికిరణ్‌ దైదా దర్శకుడు. యశ్వంత్‌ దగ్గుమాటి, సాయికిరణ్‌రెడ్డి దైదా నిర్మాతలు.

పవర్‌, ఫ్యామిలీ, ప్రేమ, ద్రోహం నేపథ్యంలో రూపొందుతున్న ఇంటెన్స్‌ పొలిటికల్‌ డ్రామా ఇదని, తాను కోరుకోని ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడు.. తన తండ్రి గతంలో దాగివున్న నిజాలను ఎదుర్కొంటూ, శక్తివంతమైన ప్రత్యర్థులతో తలపడుతూ.. తన లెగసీ భారాన్ని ఎలా మోశాడు? అనేది ఈ సినిమా కథ అని మేకర్స్‌ తెలిపారు. ఇప్పటివరకూ చూడని విభిన్నమైన, శక్తివంతమైన అవతార్‌లో విశ్వక్‌సేన్‌ కనిపిస్తారని, ప్రముఖ నటుడు కేకే మేనన్‌ ఇందులో అత్యంత శక్తివంతుడైన ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారని మేకర్స్‌ చెప్పారు.

ఈ సినిమా షూటింగ్‌ తుదిదశకు చేరుకున్నది. గురువారం నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో నెల రోజులపాటు భారీ షెడ్యూల్‌ జరుగనున్నది. ప్రధాన తారాగణం పాల్గొనే కీలకమైన సన్నివేశాలతోపాటు భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని, పాటలను కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. ఏక్తా రాథోడ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీమోహన్‌, రావురమేశ్‌, సచిన్‌ఖేడేకర్‌, రాజారవీంద్ర, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్‌, రాజీవ్‌ కనకాల, అనీష్‌ కురువిల్లా తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: జిజు సన్నీ, సంగీతం: గోవింద్‌ వసంత్‌.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana