టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇప్పటికీ వాళ్ల గురించి సోషల్ మీడియాలో వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కొందరు అప్పుడు తమకు వచ్చిన క్రేజ్ ను కంటిన్యూ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దుర్గారావు లాంటి వాళ్లు రచ్చ చేస్తున్నారు. అలాగే దీపిక పిల్లై లాంటి అమ్మాయిలు టిక్ టాక్ నుంచి ఫేమస్ అయి ఇప్పుడు ఈటీవీ ఢీ ఛాంపియన్స్ షోలో యాంకర్ గా ఛాన్స్ కొట్టేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఇప్పుడు సంచలనం రేపుతుంది. అతడి పేరు షేక్ రఫీ. ఒకప్పుడు ఈయన టిక్ టాక్‌లో చాలా ఫేమస్. రోజుకు పదుల సంఖ్యలో వీడియోలు అప్ లోడ్ చేసేవాడు.
అప్పట్లో టిక్ టాక్ లో మిలియన్స్ ఫాలోయర్స్ సంపాదించుకున్నాడు రఫీ.

