Jr NTR | ఇండియన్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రశాంత్ నీల్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని, అలాగే వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే డ్రాగన్ సినిమాను గుర్తుచేస్తూ.. ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌లో ఎన్టీఆర్ స్పందిస్తూ.. “పుట్టినరోజు శుభాకాంక్షలు డైరెక్టర్ గారూ.. మీరు చెప్పే కథలంత గొప్పగా ఈ ఏడాది మీకు సాగాలని కోరుకుంటున్నాను. మన కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్ కోసం, మన భవిష్యత్తు ప్రయాణం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను ప్రశాంత్ అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చారు.
ఈ పోస్ట్‌లో ప్రశాంత్ నీల్‌ను ఉద్దేశించి ఎన్టీఆర్ కన్నడ పదం ‘అవరే’ (గారూ) అని సంబోధించడం ఇరు భాషల అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోయే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ డ్రాగన్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

