Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రతి ఇంటిలో మొక్కలు పెంచాలి.. తుమ్మల

ప్రతి ఇంటిలో మొక్కలు పెంచాలి.. తుమ్మల

హైదరాబాద్‌, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ప్రతి ఇంటిలో మొక్కలు పెంచే సంసృతిని ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్‌ థియేటర్‌ పకన హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన 20వ 'గ్రాండ్‌ నర్సరీ మేళా-ఆల్‌ ఇండియా హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌ షో'ను మంత్రి తుమ్మల గురువారం ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ 2015 సంవత్సరం నుంచి ప్రతి ఏడాదీ జనవరి, ఆగస్టు నెలల్లో క్రమం తప్పకుండా నర్సరీ మేళాను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ మేళాలో 110కి పైగా స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana