పుణె: భారత్, ఇంగ్లండ్ మధ్య పుణె వేదికగా మూడు వన్డేల సిరీస్ ప్రేక్షకులు లేకుండానే జరుగునుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 23, 26, 28 తేదీల్లో ఎంసీఏ స్టేడియంలో మూడు వన్డేలు జరుగాల్సి ఉంది. 'మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం సూచనల మేరకు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతిస్తాం. మ్యాచ్‌లను సజావుగా నిర్వహించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాం' అని ఎంసీఏ వెల్లడించింది.

