Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Punjab Police: హైవేపై సీసీటీవీ ఇన్‌స్టాల్ చేసి.. ఆర్మీ సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నాడు..

Punjab Police: హైవేపై సీసీటీవీ ఇన్‌స్టాల్ చేసి.. ఆర్మీ సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నాడు..

న్యూఢిల్లీ: పంజాబ్ పోలీసులు(Punjab Police) పఠాన్‌కోట్‌లో భారీ ఆపరేషన్ చేపట్టారు. గూఢచర్యం కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భారతీయ ఆర్మీ, పారామిలిటరీ దళాల కదిలికలకు చెందిన అత్యంత సున్నిత సమచారాన్ని అతను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించారు.

నిందిత వ్యక్తిని బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టుగా తేల్చారు. అతని స్వగ్రామం చాక్ ధరివాల్ . పఠాన్‌కోట్‌- జమ్మూ జాతీయ రహదారి 44 మార్గంలో ఓ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న షాపు వద్ద నిందిత వ్యక్తి సీసీటీవీ కెమెరాను ఇన్‌స్టాల్ చేశాడు. ఆర్మీ, పారామిలిటరీ దళాల కదలికలపై కన్నేసేందుకు ఆ కెమెరా అమర్చినట్లు తెలిసింది.

అయితే నిఘాకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్న వారికి సమాచారాన్ని చేరవేసినట్లు తేల్చారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో సీసీటీవీ ఫూటేజ్‌ను పాకిస్థాన్‌కు చేరినట్లు పోలీసు ఆఫీసర్ దల్జీందర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. జనవరిలోని సుజన్‌పూర్ వద్ద ఉన్న హైవేపై సీసీటీవీ కెమెరాను ఇన్‌స్టాల్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. దుబాయ్‌లో ఉన్న ఓ వ్యక్తి నుంచి అతనికి ఆదేశాలు వచ్చేవి. అతను నెలకు రూ.40 వేలు ఇచ్చేవాడన్నాడు.

సీసీటీవీ కెమెరాతో పాటు ఇంటర్నెట్ వైఫై రౌటర్ అతని వద్ద నుంచి రికవరీ చేశారు. ఈ ఘటనతో లింకున్న మరో నలుగురిపై కూడా కేసు బుక్ చేశారు. పాక్ ఐఎస్ఐ గూఢచర్యంకు పాల్పడినట్లు పంజాబ్ పోలీసులు ఆరోపిస్తున్నారు. చైనాకు చెందిన సీసీటీవీ కెమెరాలతో సున్నిత ప్రదేశాలకు చెందిన లైవ్ ఫీడ్‌ను పాక్‌కు చేరవేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటనకు చెందిన ఓ మాడ్యూల్‌ను ఇటీవల జలంధర్‌లో బట్టబయలు చేశారు. కపుర్తలా పోలీసులు కూడా ఇలాంటి ఓ ఆపరేషన్‌ను గుర్తించి నాలుగు మొబైల్ ఫోన్లు రికవరీ చేవారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana