Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజకీయ విశ్లేషకులపై కేసులు సరికాదు

రాజకీయ విశ్లేషకులపై కేసులు సరికాదు

  • ప్రొ.నాగేశ్వర్‌పై కేసులను ఖండించిన సీపీఐ నేతలు నారాయణ, కూనంనేని

హైదరాబాద్‌, మే 22 (నమస్తే తెలంగాణ): మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసులు పెట్టడాన్ని సీపీఐ నేతలు కే నారాయణ, కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు.

దశాబ్దాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను విశ్లేషిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న ఆయనను ప్రజా మేధావిగా చూడాలి తప్ప, రాజకీయాలతో ముడి పెట్టకూడదని పేరొన్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను కొన్ని రాజకీయపక్షాలు తప్పుగా అన్వయించుకున్నాయని, వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు స్వయంగా నాగేశ్వర్‌ చెప్పినప్పటికీ ఆయనపై కేసులు పెట్టడం ఏమాత్రం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana