Monday, 14 Jun, 5.27 am నమస్తే తెలంగాణ

ఆదివారం
రాశి ఫలాలు

13.6.2021 నుంచి 19.6.2021 వరకు

మేషం
తలపెట్టిన కార్యాలు అనుకూలంగా పూర్తవుతాయి. సకాలంలో పనులు చేయడం వల్ల సంతృప్తికరంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. బంధువులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. కొన్ని విషయాలలో కార్యసాఫల్యత ఉంటుంది. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. పనులు కలిసివస్తాయి. రోజువారీ కార్యక్రమాలు, వ్యాపారాలలో సంతృప్తి ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. డబ్బు తిరిగి రావడంలో కొంత ఆలస్యం జరుగవచ్చు. తద్వారా కొన్ని పనులలో ఆలస్యం ఉంటుంది. వృత్తిపరంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృషభం
అంగారక స్థితివల్ల పూర్వంతో పోలిస్తే ఈవారం అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. స్నేహితులు, ఆత్మీయులతో చర్చించి పనులు చేస్తారు. సత్ఫలితాలు పొందుతారు. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. భూముల విషయంలో తీసుకున్న నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రారంభించిన పనులలో జాప్యం ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన వారం. పెద్ద పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు లాభదాయకమైన వారం. ఉద్యోగ ప్రయత్నంలో తాత్కాలిక అనుకూలత ఉంటుంది. వృత్తి జీవితం సంతృప్తిగా ఉంటుంది. ఘర్షణ వాతావరణం దూరమవుతుంది. చదువులలో రాణిస్తారు. ఆస్తుల తగాదాలు పాక్షికంగా పరిష్కారమవుతాయి.

మిథునం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో అందరి సహకారం లభిస్తుంది. సత్ఫలితాలు పొందుతారు. సమయానుకూల నిర్ణయాలతో పనులు చేపడతారు. ఉద్యోగస్తులు ఆఫీసులో తోటివారితో చిన్నపాటి మనస్పర్ధలున్నా.. అధికారుల ఆదరణ బాగా లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్త్ర, వస్తువులను కొంటారు. ఉద్యోగంలో మార్పువల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొన్ని ఖర్చులు పెరిగినా వ్యాపారం లాభసాటిగానే కొనసాగుతుంది. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. అనుభవజ్ఞుల సూచనలతో పనులు చేపడతారు. అన్ని విధాలుగా మంచి ఫలితాలను పొందుతారు.

కర్కాటకం
నిత్య వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు తోటివారితో, అధికారులతో స్నేహభావం పెంపొందించుకోవడం అవసరం. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగంలో సంతృప్తి ఉన్నా అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు ముందుకు వస్తాయి. వృత్తి, వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం బాగా లభిస్తుంది. ప్రయాణాలవల్ల కార్య సాఫల్యత ఉంటుంది. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళతారు. పట్టుదలతో పనులు చేస్తారు.

సింహం
ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో, పై అధికారులతో సంబంధాలు పెంపొందుతాయి. సంతృప్తిగా పనులు పూర్తి చేసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ప్రతిఫలాలు అందుతాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఖర్చులు, తగాదాలు ఉండవచ్చు. అప్రమత్తతతో ఉండాలి. ఆదాయం పెరుగుతుంది. ఆస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. రాబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారంలో భాగస్వాముల సహకారంతో సంతృప్తిగా కొనసాగుతుంది. వ్యవసాయదారులకు ఖర్చులు పెరుగవచ్చు. పారిశ్రామికవేత్తలకు ఉద్యోగులతో అనుకూలత ఉంటుంది.

కన్య
ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. నలుగురి సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల తోడ్పాటుతో వృత్తిలో రాణిస్తారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఇబ్బందులు ఎదురైనా కార్య దక్షతతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఉపాధి లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు ముందుకు రావచ్చు. పిల్లలు చదువు విషయంలో రాణిస్తారు. ఉన్నత విద్యా యత్నాలలో ఆర్థిక సమస్య అడ్డు రావడంతో, కొన్ని రోజులవరకు వాయిదా పడవచ్చు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు అందరి సహకారంతో ముందుకు సాగుతాయి. ఏకాగ్రత, పట్టుదల ప్రదర్శిస్తారు.

తుల
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువు విషయంలో రాణిస్తారు. ఉన్నత విద్యకు అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం సంతృప్తిగా ఉన్నా ఖర్చులు పెరుగవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. పూర్వం అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం జరుగవచ్చు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రయాణాలవల్ల అలసట, ఖర్చులు పెరుగుతాయి. వాయిదా వేసుకోవడం అన్ని విధాలుగా మంచిది. కోర్టు పనులలో సత్ఫలితాలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. రోజువారీ వ్యాపారంలో ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. బంధుమిత్రుల సూచనలతో పనులు నెరవేరుతాయి.

వృశ్చికం
వృత్తి, వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. సమాజంలో అనుభవజ్ఞుల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో సంతృప్తి ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి. వ్యాపారంలో భాగస్వాముల మధ్య మంచి అవగాహన ఉండటంతో వ్యాపారం లాభదాయకంగా ముందుకు సాగుతుంది. చిన్నపాటి మనస్పర్థలు ఉన్నా కళాకారులకు అనుకూలమైన వారం. ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి.

ధనుస్సు
సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. సంతోషంతో పనులు చేస్తారు. పనులలో బరువు, బాధ్యతలు ఉండవచ్చు. బంధువర్గంతో, స్నేహితులతో అభిప్రాయ భేదాలవల్ల కొన్ని పనులలో ఆలస్యం జరుగుతుంది. అనవసరమైన ఖర్చులు, రావలసిన డబ్బు చేతికి అందడంలో జాప్యం ఉండవచ్చు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. వాహనాలవల్ల ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. సర్దుబాట్లు అవసరం కావచ్చు. ఆదాయం స్థిరంగా ఉన్నా ఖర్చులు పెరుగడంతో ఇబ్బందులు కలుగవచ్చు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి.

మకరం
ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందడంతో సర్దుబాట్లు అవసరం పడవచ్చు. వృత్తి, వ్యాపారం వల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు భాగస్వాముల మధ్య మంచి అవగాహన, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. స్థిర చరాస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలవల్ల ఖర్చులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది.

కుంభం
శుభకార్యాలవల్ల ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. పిల్లల విద్యా యత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఆఫీసులో తోటి ఉద్యోగులతో స్నేహాన్ని పెంపొందించుకుంటారు. అధికారుల ఆదరణను పొందుతారు. బంధువర్గం సహకారం లభిస్తుంది. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. రావలసిన డబ్బు కొంత చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు చేపట్టడంలో ఆర్థిక సమస్యలవల్ల సర్దుబాట్లు అవసరం పడవచ్చు. కొన్ని అనవసరమైన నిర్ణయాలతో సమస్యలను ఎదుర్కొంటారు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. సాహితీవేత్తలకు, కళాకారులకు అనుకూలం. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన వారం.

మీనం
అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. పనులలో బరువు, బాధ్యతలు పెరిగినా శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గతంలో చేసిన పెట్టుబడులకు ప్రతిఫలాలను పొందుతారు. రాజకీయ, ప్రభుత్వ పనులలో కొంత జాప్యం ఉన్నా ఫలితం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆస్తుల విషయంలో వివాదాలు దూరమవుతాయి. స్థిర, చరాస్తులవల్ల వృత్తి, వ్యాపారాలవల్ల ఆదాయం పెరుగుతుంది. రోజువారీ పనులలో సంతృప్తి ఉంటుంది.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : nirmalsiddhanthi@yahoo.co.in

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana

related stories

Top