Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్రంలో ఉద్యాన పంటలను విస్తరించాలి.. ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి, ఐసీఏఆర్‌ పాలకమండలి సభ్యుడు వీరభద్రం

రాష్ట్రంలో ఉద్యాన పంటలను విస్తరించాలి.. ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి, ఐసీఏఆర్‌ పాలకమండలి సభ్యుడు వీరభద్రం

హైదరాబాద్‌, మే 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉద్యాన పంటలకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున ఉద్యాన పంటల విస్తరణకు ప్రణాళికలు రూ పొందించాలని ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి, ఐసీఏఆర్‌ పాలక మండలి సభ్యు డు కే వీరభద్రం పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జోనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్‌ అడ్వైజరీ కమిటీ(జెడ్‌ఆర్‌ఈఏసీ)సమావేశం జరిగింది.

ఈ సందర్భం గా రాజిరెడ్డి మాట్లాడారు. వ్యవసాయంలో జీవ నియంత్రణ పద్ధతులు కీలకమని పేర్కొన్నారు. వీరభద్రరావు మా ట్లాడుతూ తెలంగాణలో కాలిఫోర్నియా లాంటి వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఉద్యాన పంటలకు మంచి అవకాశాలు ఉ న్నట్టు చెప్పారు. స మావేశంలో ఉద్యానశాఖ సంయుక్త సంచాలకులు సంగీతలక్ష్మి, డీహెచ్‌ఎస్‌వోలు, హెచ్‌వోలు, వర్సిటీ రిజిస్ట్రార్‌ భగవాన్‌, కన్సల్టెంట్‌ వీరాంజనేయులు, జీపీ సునందిని, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana