- 32.73 లక్షల మంది రైతులకు ప్రయోజనం
- రూ.1141.44 కోట్ల ప్రీమియం చెల్లింపు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతు బీమా పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పథకం ఈ నెల 14వ తేదీ నుంచి 2021 ఆగస్టు 13వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ పథకం కింద ఈ ఏడాది 32.73 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.3,486.90 చొప్పున మొత్తం రూ.1141.44 కోట్లను ప్రభుత్వమే బీమా సంస్థకు ప్రీమియంగా చెల్లించింది. ఈ యేడాది దాదాపు 2.23 లక్షల మంది రైతులు కొత్తగా ఈ పథకంలో చేరుతున్నారు. దీనికి 1961 ఆగస్టు 14వ తేదీ నుంచి 2002 ఆగస్టు 14వ తేదీ మధ్య జన్మించిన వారు అర్హులు.

