Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతు మహాధర్నా నిర్వాహకులపై కేసు.. ఐదుగురి బీఆర్‌ఎస్‌ నాయకులపై నమోదు

రైతు మహాధర్నా నిర్వాహకులపై కేసు.. ఐదుగురి బీఆర్‌ఎస్‌ నాయకులపై నమోదు

వంగూర్‌, మే 29 : రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో 27న బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూర్‌ మండల కేంద్రం లో మహాధర్నా నిర్వహించగా పోలీసు లు కేసు నమోదుచేశారు.

ఈ ధర్నాకు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సభకు భారీ స్పందన లభించింది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన అధికార పార్టీ నాయకులు ఓ చోట కాంగ్రెస్‌ నాయకుడితో కేసు పెట్టించారు.

రోడ్డు ఆక్రమించి మహాధర్నా చేపట్టడంతో రాకపోకలకు ఇబ్బందులు అయ్యాయనే ఫిర్యాదుతో బీఆర్‌ఎస్‌ నాయకులు గణేశ్‌రావు, నరేందర్‌రావు, సురేందర్‌, రాజేందర్‌రెడ్డి, శ్రీపతిరావుపై కేసు నమోదు చేశారు. విచిత్రమేమంటే.. మహాధర్నా నిర్వహణకు అనుమతి కోసం బీఆర్‌ఎస్‌ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అలాగని నిరాకరించలేదు. స్టేజీ ఒకచోట వేస్తుంటే.. పోలీసులు వచ్చి స్టేజీని కాస్త పక్కకు మార్చారని బీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పారు. పోలీసులు చెప్పినట్టే స్టేజీ వేసుకొని సభ నిర్వహించినా.. కేసులు పెట్టడమేమిటని బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana