Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rashmika | భర్త విజయ్‌తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..

Rashmika | భర్త విజయ్‌తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..

Rashmika | నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల 'మైసా' సినిమా షూటింగ్‌లో ఆమెకు తీవ్రమైన గాయం కావడంతో దాదాపు నెలన్నర రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.

తాజాగా పూర్తిగా కోలుకున్న రష్మిక మళ్లీ షూటింగ్‌లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో జరుగుతున్న 'రణబాలి' మూవీ షూటింగ్‌లో పాల్గొంటూ తిరిగి తన బిజీ షెడ్యూల్‌లోకి వచ్చేశారు.'మైసా' ఓ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఓ సాంగ్ షూట్ చేస్తుండగా రష్మిక హిప్ బోన్ దగ్గర టెండన్‌కు తీవ్ర గాయం అయింది. ఆ సమయంలో పెద్ద శబ్దం వచ్చినట్లు అనిపించినా.. మొదట ఆమె దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

నొప్పిని భరిస్తూనే షూటింగ్ కొనసాగించిన రష్మిక.. చివరకు కుడి కాలును పైకి ఎత్తలేని పరిస్థితికి చేరుకున్నారు. అయినప్పటికీ షూట్‌ను పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్లి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోగా గాయం తీవ్రత బయటపడింది. అంతటి గాయంతో కూడా నడుచుకుంటూ ఆసుపత్రికి రావడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారని రష్మిక చెప్పారు.ఇక ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న రష్మిక.. పెళ్లి తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. విజయ్ కూడా తన సినిమాలతో బిజీగా ఉండటంతో ఇద్దరూ దాదాపు మూడు నెలల పాటు ఒకరినొకరు సరిగ్గా కలుసుకోలేకపోయారట.అయితే అనుకోకుండా వచ్చిన ఈ గాయం కారణంగా రష్మిక ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో పెళ్లి తర్వాత తొలిసారి విజయ్‌తో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఆమెకు దక్కింది.

మేము పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత ఎక్కువ సమయం కలిసి ఉండటం ఇదే ఫస్ట్ టైమ్. నేచర్ నన్ను ప్రశాంతంగా ఇంట్లో కూర్చోబెట్టి మా ఇద్దరికీ ఈ క్వాలిటీ టైమ్ ఇచ్చిందేమో అనిపించింది అంటూ రష్మిక ఎమోషనల్ అయ్యారు. ఇక ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరూ కలిసి సమయాన్ని బాగా ఎంజాయ్ చేశారట. విజయ్ దేవరకొండకు సీరియస్ షోలు చూడటం ఇష్టమైతే.. రష్మికకు కే-డ్రామాలు అంటే చాలా ఇష్టమట. అంతేకాదు.. ఇప్పటికే విజయ్‌ను కూడా కే-డ్రామాలు చూసేలా మార్చేశానని రష్మిక సరదాగా చెప్పారు. రష్మిక గాయంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో విజయ్ దేవరకొండ కూడా సరదాగా స్పందించారట. మనమిద్దరం ఇలా ఇంట్లో ప్రశాంతంగా టైమ్ స్పెండ్ చేయడం చాలా బాగుంది. కానీ నెక్స్ట్ టైమ్ ఇలాంటి క్వాలిటీ టైమ్ గాయాలు లేకుండా దక్కితే ఇంకా బాగుంటుంది అంటూ విజయ్ ఫన్నీగా కామెంట్ చేశారని రష్మిక వెల్లడించారు. గాయం కారణంగా షూటింగ్‌లకు దూరంగా ఉన్న సమయంలో రష్మిక ఫ్యామిలీతో కలిసి సమయం గడిపారు. పజిల్స్ సాల్వ్ చేస్తూ, ప్రశాంతంగా ఉంటూ.. చాలా రోజుల తర్వాత మంచి నిద్రను కూడా ఆస్వాదించినట్లు చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana