Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెడ్‌బ్యాగ్‌లో ఏముంది?

రెడ్‌బ్యాగ్‌లో ఏముంది?

బీర్‌సింగ్‌, ప్రసాద్‌ బెహరా, రాధ్య, మోనిక, స్నేహాసింగ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ది రెడ్‌బ్యాగ్‌'. రవికుమార్‌ సీరపు దర్శకుడు.

మెమరీ మేకర్స్‌ పతాకంపై హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి కథానాయిక రాధ్య పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె చేతుల్లో గన్‌, సూట్‌కేస్‌తో ఇంట్రెస్టింగ్‌ లుక్‌లో కనిపిస్తున్నది.

మిస్టరీ నేపథ్యంలో సాగే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఇదని, రెడ్‌బ్యాగ్‌ చుట్టూ చోటుచేసుకునే సంఘటనలు ఉత్కంఠను పంచుతాయని, త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. రాశి, ఆకాంక్ష, ఈషాన్‌ శంకర్‌, అవినాష్‌ బదల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ మోపురి, దర్శకత్వం: రవికుమార్‌ సీరపు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana