Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డికి కేరళ అవార్డు.. 'బెస్ట్‌ పబ్లిక్‌ సర్వెంట్‌'గా సత్కారం

Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డికి కేరళ అవార్డు.. 'బెస్ట్‌ పబ్లిక్‌ సర్వెంట్‌'గా సత్కారం

Revanth Reddy | హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేరళలో ప్రతిష్ఠాత్మక 'ఆర్యదాన్‌ మహమ్మద్‌-2026 బెస్ట్‌ పబ్లిక్‌ సర్వెంట్‌ అవార్డు' లభించింది.

కేరళలోని నిలంబూరులో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పురసారాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు. కేరళ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి దివంగత ఆర్యదాన్‌ మహమ్మద్‌ స్మారకార్థం ఆర్యదాన్‌ మహమ్మద్‌ ఫౌండేషన్‌ ఈ పురసారాన్ని ఏర్పాటుచేసింది.

అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. ఆర్యదాన్‌ మహమ్మద్‌ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో ఓట్ల దొంగతనం, పార్టీల దొంగతనం, ఎన్నికల గుర్తుల దొంగతనం, నిధుల దొంగతనం జరుగుతున్నాయంటూ బీజేపీపై పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. ఫౌండేషన్‌ వరింగ్‌ చైర్మన్‌ షౌకత్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana