రోజును ప్రారంభించడానికి వన్యప్రాణుల వీడియోల కంటే గొప్పది మరొకటి ఉండదు. ముఖ్యంగా ఏనుగుల వీడియో అయితే మరింత హాయినిస్తుంది. ఏనుగులు ఇంటర్‌నెట్‌ను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఒక చిన్న ఏనుగు కుటుంబం వీడియోను ట్వీట్ చేశాడు.
44 సెకండ్లపాటు నడిచే ఈ వీడియోలో పిల్ల ఏనుగులు స్నానం చేస్తుండగా తల్లి ఏనుగులు నిఘా పెట్టాయి. ఎవరైనా చూస్తున్నారా అన్నట్లు చుట్టువైపులా ఓ కన్నేసి చూస్తున్నాయి. పరంబికులం టైగర్ రిజర్వ్ వద్ద ఒక ఏనుగు కుటుంబం లాక్‌డౌన్ వ్యవధిని ఆస్వాదిస్తున్నాయి. పిల్లలను చూడండి అనే శీర్షికతో పోస్ట్ చేశారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జీవ-వైవిధ్యం, స్వదేశీ ప్రజలకు నిలయంగా ఆ ప్రదేశానికి మంచి పేరుంది.
అందం, ప్రశాంతతను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను 21 వేలమంది వీక్షించగా 17,000కు పైగా లైక్స్ సంపాదించుకున్నది.

