Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రౌడీ జనార్ధనకు ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌

రౌడీ జనార్ధనకు ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌

రెండు సినిమాల్లో సమాంతరంగా నటిస్తూ బిజీగా బిజీగా ఉన్నారు అగ్ర హీరో విజయ్‌ దేవరకొండ. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ ఏడాదే రెండు సినిమాలూ విడుదలయ్యే అవకాశం ఉంది.

వాటిలో రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్న 'రణబాలి' చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌ 11న విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తుంటే, మరో సినిమా 'రౌడీ జనార్ధన'ని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు ఆ చిత్ర నిర్మాత దిల్‌రాజు.

ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉన్నది. దర్శకుడు రవికిరణ్‌ కోలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుంటే.. క్రిస్టో జేవియర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 'టాక్సిక్‌’ఫేం విశాల్‌ మిశ్రా కూడా ఈ చిత్ర పాటల స్వరకల్పనలో భాగం అయ్యారు. ఇద్దరు ప్రతిభావంతులైన సంగీత దర్శకులు కలిసి ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. ఉత్కంఠభరితమైన గ్రామీణ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana