RS Praveen Kumar | బీఆర్‌ఎస్ 3.0 ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉండబోతుంది.. నేను చాలెంజ్ చేస్తున్నా.. వాగ్ధానం చేస్తున్నా. దయాదాక్షిణ్యాలుండవని బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంచి చేసినోళ్లను.. చట్టప్రకారం పోయినోళ్లను గుండెల్లో పెట్టి కాపాడుకుంటది.. కానీ కేసీఆర్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో వచ్చే బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరెవరైతే అక్రమంగా తప్పులు చేశారో, అక్రమ కేసులు పెట్టారో, ప్రజలను వేధించారో రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలనుసారం ఘోరంగా హింసించారో వాళ్లందరి మీద కూడా చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు.
గట్టిగా అడిగిన బీఆర్‌ఎస్ నేతల గన్‌మెన్లందరినీ కూడా తీసేశారు. మేం ఈ రోజు కూడా అడుగుతున్నం. గన్‌మెన్లను ఏ బేసిస్ మీద తీసేశారు. ఏ బేసిస్ మీద జానారెడ్డికి అత్యుత్తమమైన బుల్లెట్ ప్రూప్ కారు ఇచ్చారు. ఆయనేమైనా ముఖ్యమంత్రా..? లేదా ఇంకేమైనా రాజ్యాంగబద్దమైన పొజిషన్ ఉందా.. ఏం లేదు.. ఆయనకు బుల్లెట్ ప్రూప్ కారు ఎట్లా వచ్చిందని ప్రశ్నించారు. ఏ బేసిస్ మీద రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డికి, కొండల్ రెడ్డికి 2+2 గన్‌మెన్‌లు ఇచ్చారు.. ? మా జోగు రామన్నతోపాటు మిగితా సీనియర్ నాయలకుందరికీ కూడా ఎందుకు ఇవ్వడం లేదని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
అయ్యా దయచేసి మాకు న్యాయం చేయండి.. అని డీజీపీకి 15రోజుల క్రితం వాళ్లు లేఖ రాశారు. ఏమీ అర్హత లేని వాళ్లకు ఇచ్చారు. కొంతమందైతే 80 సంవత్సరాల ముసలోళ్లకు కూడా గన్‌మెన్లను ఇచ్చారు. ఆ 80 సంవత్సరాల ముసలోళ్లను ఈ రాష్ట్రమే మరిచిపోయింది. వాళ్లకు కూడా గన్‌మెన్లను తీసేశారు.. ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి దగ్గర.. ఏ బేసిస్ మీద గన్‌మెన్లను తీసేసిండ్రని అడిగితే లేకపోతే మీ మీద తప్పుడు కేసు పెడతామని బెదిరిస్తారని మండిపడ్డారు.

