Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RS Praveen Kumar | ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై కేసు పెట్టించి బాధితులకు న్యాయం చేయాలి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

RS Praveen Kumar | ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై కేసు పెట్టించి బాధితులకు న్యాయం చేయాలి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

RS Praveen Kumar | ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బాధితులకు న్యాయం జరిగేలా ఆ పార్టీ చీఫ్‌ అసదుద్దీన్ ఒవైసీ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జెనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

బాధితులను అసదుద్దీన్ ఒవైసీ డీజీపీ దగ్గరికి లేదా పోలీస్ కమిషనర్‌ దగ్గరికి తీసుకెళ్లి, తన దగ్గరున్న ఆధారాలను ఇచ్చి మీర్జా రహ్మత్ బేగ్‌పై కేసు పెట్టించి వారికి న్యాయం జరిగేలా చూడాలని నిర్దేశించారు.

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తూ దొరికిపోయాడని ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ సయ్యద్ సబ్దర్ అలీ ఆరోపణలు చేశాడని తెలిసిందే. మీర్జా రహ్మత్ బేగ్ మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేస్తుంటే కొందరు యువకులు పట్టుకొని కొట్టి, వీడియోలు తీశారని ఈ విషయం అసదుద్దీన్ ఒవైసీకి ముందే తెలుసునని జర్నలిస్ట్ సయ్యద్ సబ్దర్ అలీ అన్నాడు.

ఈ క్రమంలో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌పై ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకున్నది. ఆయనను పార్టీ నుంచి తక్షణమే బహిషరిస్తున్నట్టు ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే రాజీనామా చేసి, ఆ లేఖను శాసనమండలి చైర్మన్‌కు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఎంఐఎం సంయుక్త కార్యదర్శి ఎస్‌ఏ హుస్సేన్‌ అన్వర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే రహ్మత్‌ బేగ్‌పై చర్యలకు దారితీసిన పూర్తి కారణాలను పార్టీ తన ప్రకటనలో వెల్లడించలేదు. మీర్జా రహ్మత్‌ బేగ్‌ 2023లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2029 మే వరకు కొనసాగాల్సి ఉన్నది.

Read Also :

Switzerland | స్విట్జర్లాండ్ రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు

వైభవంగా మార్వాడీల కావడి యాత్ర.. హరిహర మహాదేవ' నామస్మరణతో సాగిన భక్తుల పాదయాత్ర

TVK vs Cong | కాబోయే ప్రధాని విజయ్ అంటూ జోరుగా ప్రచారం.. అధికార కూటిమిలో కలకలం..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana