Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RSS | బండి భగీరథ్ 'పోక్సో' వివాదంతో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదు..!

RSS | బండి భగీరథ్ 'పోక్సో' వివాదంతో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదు..!

RSS : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ 'పోక్సో' కేసు(POCSO Case)తో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఆర్‌ఎస్‌ఎస్(RSS) నాయకుడు బి.

సుందర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇది బీజేపీ అంతర్గత సమస్య అని పేర్కొన్న ఆయన కొన్ని మీడియా సంస్థలు తమ కార్యకర్తలను వివాదంలోకి లాగడాన్ని ఆయన తప్పుబట్టారు.

బండి భగీరథ్ పోక్సో కేసు వివాదంలో కొన్ని మీడియా సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల పేర్లను ప్రస్తావించడాన్ని బి. సుందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మాకు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోస్కో కేసుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. బండి సంజయ్‌కు.. ప్రాంత కార్యవాహ కాచం రమేష్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్‌ల మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయని, అందుకే.. వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారనే నిరాధార ఆరోపణలను ఆయన ఖండించారు.

భగీరథ్ పోక్సో కేసులో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను లాగడం, అసత్య కథనాలతో వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బీజేపీ అంతర్గత, సంస్థాగత వ్యవహరాలను కేంద్ర నాయకత్వం నేరుగా పర్యవేక్షిస్తుందని.. ఇందులో రాష్ట్ర ఆర్‌ఎస్‌ఎస్‌ జోక్యం చేసుకోదని సుందర్ రెడ్డి వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana