Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.4,800 తగ్గిన బంగారం ధర

రూ.4,800 తగ్గిన బంగారం ధర

న్యూఢిల్లీ, జూన్‌ 17: బంగారం శాంతించింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ లేకపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటంతో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి.

న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్‌ ధర ఏకంగా రూ.4,800 తగ్గి రూ.1,54,400కు తగ్గింది. అంతకుముందు ఇది రూ.1.59 లక్షల స్థాయిలో ఉన్నది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి.

పారిశ్రామిక వర్గాలు నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో కిలో వెండి రూ.5,300 తగ్గి రూ.2,55,400గా నమోదైనట్లు ఆల్‌ ఇండియా సరఫా అసోసియేషన్‌ వెల్లడించింది. దేశీయంగా డిమాండ్‌ లేకపోవడం, పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను అధిక రిటర్నులు పంచే ఈక్విటీల్లోకి మళ్లించడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూటీ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 4,327.54 డాలర్లు పలుకగా, వెండి 69.89 డాలర్లకు పడిపోయాయి. అలాగే అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య మరోసారి శాంతిచర్చలు జరుగనుండటం కూడా వీటిపై దృష్టి సారించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana