Dailyhunt
సానియా చెల్లెలి పెళ్ళిలో ఫ్లోర్ డ్యాన్స్ వేసిన రామ్ చరణ్‌

సానియా చెల్లెలి పెళ్ళిలో ఫ్లోర్ డ్యాన్స్ వేసిన రామ్ చరణ్‌

హెచ్‌సీఏ అధ్యక్షులు అజహారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మిర్జా చెల్లెలు ఆనమ్ మిర్జా వివాహా రిసెప్షన్ ఈ నెల 12న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సానియాకి రామ్‌చరణ్‌కి ఎప్పటి నుండో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అప్పుడప్పుడు వీరు ఫ్యామిలీతో కలుస్తూనే ఉంటారు. తాజాగా సానియా చెల్లెలి పెళ్లి వేడుకకి చరణ్ ఆయన సతీమణి ఉపాసన హాజరయ్యారు. సానియాతో కలిసి ఫోటోలకి ఫోజులిచ్చారు. అంతేకాదు చరణ్‌..
ఫరాఖాన్,సానియాలతో కలిసి ఫ్లోర్ డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana